అద్దంకి దయాకర్ కు హస్తం హ్యాండ్! | congress rejects party ticket to addanki dayakar| tongaturti| mandula| samyul| final| list
posted on Nov 10, 2023 5:28AM
అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. తుంగతుర్తి నుంచి పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు రిక్త హస్తం చూపింది. గురువారం రాత్రి విడుదలైన కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాలో తుంగతుర్తి నుంచి మందుల శామ్మూల్ కు టికెట్ లభించింది. మొత్తం మీద నామినేషన్ల దాఖలు గడువు ముగియడానికి ఒక రోజు ముందు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.
ఐదుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం(నవంబర్9) రాత్రి అధిష్టానం విడుదల చేసింది. తుంగతుర్తి నుంచి మందుల సామేలు, పటాన్ చెరు అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి మహమ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట అభ్యర్థిగా దామోదర్ రెడ్డిలకు టికెట్ ఖరారు చేసింది. ఇప్పటికే పటాన్ చెరు నియోజకవర్గం నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించిన కాంగ్రెస్ అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది.
తుది జాబితాలో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్‌ను ఫైనల్ చేసింది. దీనిపై మధు, ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంతకాలం తనకు టికెట్ వస్తుందని భావించిన తుంగతుర్తి నియోజకవర్గ నేత అద్దంకి దయాకర్‌కు హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మందుల శ్యామ్యూల్‌ను ఖరారు చేసింది. దీంతో అద్దంకి దయాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.