Leading News Portal in Telugu

సుప్రీం ఆవరణలో మిట్టీ కెఫె.. ప్రారంభించిన సీజేఐ | mitti cafe in supreme premisis| cji| open| differently| abled| corona| 60lac


posted on Nov 11, 2023 10:21AM

అందరికీ సమానావకాశాలు దిశగా సుప్రీం కోర్టు ఒక ముందడుగు వేసింది. దివ్యాంగులతో నడిచే మిట్టీ కెఫేను సుప్రీం కోర్టు ఆవరణలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ శుక్రవారం (నవంబర్ 9)న ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. ‘ఈ కెఫేను నడిపేవారంతా ప్రత్యేక అవసరాలున్నవారనీ, వీరి ఆధ్వర్యంలో  దేశవ్యాప్తంగా ‘మిట్టీ కెఫే’ 38 కేఫ్‌టేరియాలను నిర్వహిస్తోందని వివరించారు.

ఈ మిట్టీ కెఫే  కరోనా సమయంలో 60 లక్షల భోజనాలను అందించిందనీ,  ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కెఫే ప్రారంభమవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రత్యేక వెంచర్‌కు బార్‌ సభ్యులంతా మద్దతుగా ఉండాలని, ఉంటారనీ ఆకాంక్షించారు. సహచర న్యాయమూర్తులతో కలిసి కేఫ్‌టేరియాకు వెళ్లిన ఆయన.. అక్కడ టీ తాగి , సమోసా తిన్నారు.