Leading News Portal in Telugu

మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు


posted on Nov 16, 2023 2:22PM

ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తాజాగా  హైదరాబాద్‌తో పాటూ నల్గొండ, మిర్యాలగూడ‌లో 40 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు తనఖీలు చేపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు నిల్వ చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ రైడ్స్‌ జరగుతున్నాయి.  హైదరాబాద్‌ సహా నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నల్లమోతు భాస్కర్  అనుచరుడు శ్రీధర్‌ నివాసంలో కూడా ఐటీ దాడులు జరిగాయి. శ్రీధర్‌ నివాసంలో తెల్లవారుజామున నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నల్లమోతుకు వ్యాపారాలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పలు పవర్‌ప్లాంట్లలో నల్లమోతు భాస్కర్‌రావు పెట్టుబడులు పెట్టినట్టు వివరాలు సేకరించారు. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ చేసినట్టు నల్లమోతు భాస్కర్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి.