Leading News Portal in Telugu

బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్త… స్వల్ప ఉద్రిక్తత


posted on Nov 16, 2023 11:13AM

ప్రముఖ సినీ నటుడు,  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత అశ్వర్థరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్య… తిరిగి ఇంటికి వెళ్తుండగా మధు అనే వైసీపీ కార్యకర్త ఆయన కారును అడ్డుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో వాహనాన్ని అడ్డుకోబోయాడు. మధును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.దీంతో అక్కడ కొంతసేపు హైడ్రామా చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచి బాలయ్య కాన్వాయ్ బయల్దేరింది.  అంతకుముందు ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు  జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు.