Leading News Portal in Telugu

తెలంగాణలో అధికారం కాంగ్రెస్ దే.. లోక్ పోల్ సర్వే | congress to power tn telangana| lokpoll| survey| khammam| nalgonda| clean


posted on Nov 18, 2023 1:05PM

తెలంగాణ ఎన్నికలలో హస్తం హవాలో కారు బేజారేనా అంటే లోక్ పోల్ తాజా సర్వే ఔననే అంటోంది. వచ్చే ఎన్నికలలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని లోక్ పోల్ సర్వే ఫలితం చెబుతోంది. రాష్ట్రంలో కనీసం 74 స్థానాలలో హస్త వాసి అమోఘంగా ఉందని సర్వే ఫలితం పేర్కొంది. ఇక రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన కారు పార్టీ ఈ సారి 29 స్థానాలలోనే విజయం సాధిస్తుందని సర్వే ఫలితం చెబుతోంది. 

అయితే గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని  పేర్కొంది. ఇక రాష్ట్రంలో అధికారం మాదేనంటూ నిన్నమొన్నటి వరకూ గట్టిగా చెప్పిన బీజేపీ మాత్రం సింగిల్ డిజిట్ స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని సర్వే పేర్కొంది. బీజేపీ ఓ తొమ్మది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక మజ్లిస్ 6 స్థానాలలో గెలుపొందుతుందని సర్వే తెలిపింది.  

ఇక ఖమ్మం జిల్లాలో పది స్థానాలకు గాను పదిస్థానాలనూ కాంగ్రెస్, సీపీఐ కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని లోక్ పోల్ సర్వే ఫలితం తెలిపింది. పొత్తులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఒక స్థానంలో సీపీఐ అభ్యర్థి రంగంలో ఉన్న సంగతి విదితమే. అలాగే నల్గొండ జిల్లాలో కూడా హస్తం క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. గ్రేటర్ విషయానికి వచ్చేసరికి.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ కూడా సరి సమానంగా గెలిచే అవకాశాలున్నాయని సర్వే ఫలితం తెలిపింది. బీజేపీ గ్రేటర్ లో మూడు స్థానాలలో గెలుస్తుందనీ, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కూడా మూడేసి స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని లోక్ పోల్ సర్వే ఫలితం వెల్లడించింది.

లోక్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు ఇలా ఉండే అవకాశం ఉంది. 

జిల్లా             బీఆర్ఎస్     బీజేపీ            కాంగ్రెస్

ఖమ్మం               0                   0             9 ప్లస్ 1 (సీపీఐ)

రంగారెడ్డి           5                  2                 7

వరంగల్            3                  0                9

నల్గొండ             0                  0              12

పాలమూరు       3                    0            11

మెదక్                6                  1               6

కరీంనగర్          3                  2              8

నిజామాబాద్     3                 0              3

ఆదిలాబాద్      3                 1              6

హైదరాబాద్     3                 3             3  (మిగిలిన 6 స్థనాలలోనూ ఎంఐఎం విజయం)