posted on Nov 19, 2023 2:25PM
టీమ్ ఇండియా 16 ఓవర్లు పూర్తి అయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 34 పరుగులతో, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. శుభమన్ గిల్ ఔట్ అయిన తరువాత కూడా టీమ్ ఇండియా జోరు తగ్గలేదు. స్కిప్పర్ రోహిత్ శర్మ అలవోకగా బౌండరీలు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అదే విధంగా విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడాడు.
అయితే మరో బంతితో పవర్ ప్లే ముగుస్తుందనగా 47 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ మూడు బంతులు ఎదుర్కొన్న శ్రేయస్స్ అయ్యర్ నాలుగు పరుగుతు చేసి ఔటయ్యాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో టీమ్ ఇండియాకు దెబ్బమీద దెబ్బపడినట్లైంది. శ్రేయస్ అయ్యర్ ఔట్ అవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన రాహుల్ తో కలిసి విరాట్ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు.
అయితే టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ప్లాన్ ప్రకారమే ఆడింది. పవర్ ప్లేలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వికెట్లు పడగొట్టాలన్న ఆసీస్ వ్యూహం ఫలించలేదు. వికెట్లు పడినా పవర్ ప్లే ముగిసే సరికి టీమ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. రోహిత్, ఆ వెంటనే అయ్యర్ ఔట్ అవ్వడం, ఫీల్డ్ రిస్ట్రిక్షన్ తొలగిపోవడంతో స్కోరింగ్ రేట్.. అంటు పరుగుల ప్రవాహం కొంత తగ్గింది. కేఎల్ రాహుల్, కింగ్ కోహ్లీలు సంయమనంతో ఆడుతున్నారు.