posted on Nov 19, 2023 3:06PM
148 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కమిన్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (54) అవుట్ అయ్యాడు. దీంతో మొత్తం లక్షమందికి పైగా ఉన్న అహ్మదాబాద్ స్టేడియం ఒక్క సారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. వరల్డ్ కప్ ఫైనల్ ీలో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా.. పవర్ ప్లేలో దూకుడుగా పరుగులు సాధించినా ఆ తరువాత మాత్రం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వస్తోంది. శ్రేయస్ అయ్యర్ అవుటైన తరువాత రాహుల్ తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించిన కోహ్లీ ఆసీస్ స్కిప్పర్ బౌలింగ్ లో ప్లేడాన్ గా వెనుదిరిగాడు. ఒక వైపు పరుగుల వేగం తగ్గిపోవడం, మ రో వైపు కోహ్లీ ఔట్ అవ్వడంతో భారత అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కోహ్లీ అవుటైన తరువాత జడేజా క్రీజ్ లోకి వచ్చాడు.
విరాట్ కోహ్లీ 63 బంతుల్లో నాలుగుఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీకి ఇది ఆరవ హాఫ్ సెంచరీ, ఇవి కాకుండా మూడు సెంచరీలు కూడా చేశాడు. ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కోహ్లీ టాప్ లో ఉన్నాడు.