posted on Nov 19, 2023 12:55PM
టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయాలని ఆస్ట్రేలియా ఎంచుకోవడం రోగి కోరుకున్నట్లు వైద్యుడు పాలు ప్రిస్క్రైబ్ చేసినట్లైంది. తాము టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలని భావించామని టాస్ తరువాత టీమ్ ఇండియా స్కిప్పర్ రోహిత్ శర్మ చెప్పారు.
పిచ్ చాలా బాగుంది. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఆ తరువాత ఆసీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.