Leading News Portal in Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు ఖరారు | counting centers confirmed| telangana| assembly| elections


posted on Nov 21, 2023 8:53AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

 దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు  అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ కేంద్రాలు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపడతారు.

మిగిలిన 13 నియోజకవర్గాలకూ వేరువేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాలలో జిల్లాకు ఒకటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.