శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు | south central railway special trains to sabarimalai| 22| sleeper| coach| reserved| unreserved
posted on Nov 21, 2023 8:59AM
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం(నవంబర్ 20) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 26 నుంచి మొదలౌతాయి. సికింద్రాబాద్-కొల్లం ప్రత్యేక రైలు ఈ నెల 26న, అలాగే డిసెంబరు 3వ తేదీనా నడపనుంది.
ఇక కొల్లం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 28, డిసెంబరు 5న నడుస్తుంది. అలాగే నర్సాపూర్-కొట్టాయం ఈ నెల 26, డిసెంబరు 3తేదీలలోనూ, తిరుగు ప్రయాణం కోసం కొట్టాయం-నర్సాపూర్ ప్రత్యేక రైలు ఈ నెల 27, డిసెంబరు 4 తేదీలలోనూ ఉంటుంది. ఇక కాచిగూడ నుంచి కొల్లం వెళ్లే స్పెషల్ ట్రైన్ డిసెంబర్ 9, 22, 29 తేదీలలో ఉంటుంది.
అలాగే కొల్లం నుంచి కాచిగూడకు వచ్చే ప్రత్యేక రైలు 24, డిసెంబరు 1, 8; కాకినాడ-కొట్టాయం ఈ నెల 23, 30, కొట్టాయం-కాకినాడ ఈ నెల 25, డిసెంబరు 2; సికింద్రాబాద్-కొల్లం ఈ నెల 24, డిసెంబరు 1; కొల్లం-సికింద్రాబాద్ ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో ఉంటాయి. వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్ లు ఉంటాయి.