జగన్ కుర్చీలో టిక్ టాక్ స్టార్ దుర్గారావు! నెట్టింట రచ్చ చేస్తున్న వీడియో | tiktok star durgarao in cm chair| videos| viral| netizens| troll| jagan| cmo| rent
posted on Nov 23, 2023 12:06PM
సీఎం కార్యాలయం అంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను పాలించే , కోట్లాది మంది సమస్యలను తీర్చే ఆలయం లాంటి కార్యాలయం. అందులో సీఎం కుర్చీకి ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అలాంటి సీఎం కార్యాలయాన్ని జగన్ సర్కార్ సోషల్ మీడియా వీడియోల షూటింగులకు వేదికగా మార్చేసింది. సీఎం చెయిర్ సోషల్ మీడియా నటులకు ఆసనంగా మార్చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొనేందుకు వీడియోలు షూట్ చేసుకొనేందుకు సీఎం కార్యాలయం, సీఎం చెయిర్ సెట్ ప్రాపర్టీగా మార్చేసింది. సీఎం కార్యాలయం గౌరవం, సీఎం చెయిర్ గౌరవం ఒక టిక్ టాక్ స్టార్ తన ప్రమోషన్ కోసం వాడుకునేందుకు అప్పనంగా అప్పగించేశారు సీఎంవో అధికారులు. ప్రభుత్వం అంటే ఏమిటో, ముఖ్యమంత్రికి ఉండాల్సిన హుందాతనం ఏమిటో ఏ మాత్రం తెలియని ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రతిష్టను ఒక టిక్ టాక్ స్టార్ కోసం మంటగలిపేశారు. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొనేందుకు, సిల్లీ సిల్లీ వీడియోలు చేసుకొనేందుకు ఆరు కోట్ల ప్రజల మంచి చెడ్డలను, రాష్ట్ర ప్రగతి, ఉన్నతికి ప్రణాళికలు రూపొందించేందుకు తాను కూర్చుని పని చేయాల్సిన కూర్చుని ఒక టిక్ టాక్ స్టార్ కు ఆసనంగా మార్చేశారు సీఎం జగన్. ఇంతకీ ఏం జరిగిందంటే..
రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా భావించే సీఎం కార్యాలయంలో సోషల్ మీడియా వీడియోలను షూట్ చేసుకొనేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చేసింది. తనను తాను సోషల్ మీడియా స్టార్ గా చెప్పుకొనే దుర్గారావు అనే కమేడియన్ లాంటి వ్యక్తి ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చొని పోజులిచ్చారు. సీఎం కుర్చీలో కూర్చొని వీడియోలు షూట్ చేసి సోషల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ లెవెల్ లో సీఎం జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. సీఎం జగన్ కుర్చీ మరీ ఇంత చీప్ అయిపోయిందా అంటూ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ముందు ముందు సీఎం ఆఫీసును సినిమా షూటింగులకు కూడా అద్దెకి ఇచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేసే నటుడికి పోలీసులు, అధికారులు సీఎంఓలో వీడియోలు చేసుకొనేందుకు అనుమతి ఎలా ఇచ్చారన్నది సమాధానం రాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏకంగా సోషల్ మీడియా యాక్టర్ సీఎం కుర్చీలో కూర్చొని వీడియోలు చేసుకుంటుంటే క్యాంప్ కార్యాలయం అధికారులు ఎలా చూస్తూ ఊరుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టిక్ టాక్ అనే యాప్ ద్వారా రకరకాల టాలెంట్ ను బయటపెట్టి చాలా మంది పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వారిలో దుర్గారావు అనే వ్యక్తి కూడా ఒకరు. దుర్గారావు తన డ్యాన్స్ లతో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘పలాస’ సినిమాలో ‘మీ బావగారు వచ్చేటి వేళ’ అనే పాటకు తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత టిక్ టాక్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ అయితే పోయింది కానీ.. అందులో పేరు తెచ్చుకున్న వాళ్ళు మాత్రం రకరకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లలో వీడియోలు చేస్తూనే ఉన్నారు. నెటిజన్లను ఆకట్టుకునేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. అందరిలాగానే దుర్గారావు కూడా తన భార్యతో కలిసి డాన్సులు వేస్తూ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ఆ మధ్య అడపా దడపా కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు టీవీ షోలలో కూడా కనిపించిన దుర్గారావు.. కొన్నాళ్లపాటు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. అవకాశాలు తగ్గిపోవడంతో తన ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరిలోని తన సొంత ఊర్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ డాన్స్ వీడియోలు చేసుకుంటున్నాడు.
కానీ ఇప్పుడు హఠాత్తుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు ఆఫీసులో ప్రత్యక్షమయ్యాడు. అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో కానీ.. ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీసులో, అందులోనూ సీఎం కార్యాలయంలో వీడియో చేశాడు. సీఎం కుర్చీలో కూర్చుని ఫోజులిచ్చాడు. అనుమతి ఇచ్చినందుకు పోలీసులకూ, అధికారులకూ కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడే మరో వీడియో కూడా చేసి పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా నెటిజనులు సీఎం జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సినిమా షూటింగులకు సీఎం క్యాంప్ ఆఫీస్ అద్దెకిచ్చి రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని జగన్ జగన్ కు సలహాలిస్తున్నారు. క్యాంపు ఆఫీస్ అధికారులు షూటింగ్ చూసేందుకు జనాలకు టికెట్లు అమ్మి అనుమతులిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని సూచిస్తున్నారు. సీఎం జగన్ కూడా సోషల్ మీడియా స్టార్ కావడంతో మరో సోషల్ మీడియా నటుడిని ఎంకరేజ్ చేసేందుకు ఇలా తన ఆఫీసును అద్దెకిచ్చి ఉంటారని సెటైర్లు రువ్వుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా సీఎం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దుర్గారావు సీఎం క్యాంప్ ఆఫీస్ ను షూటింగ్ స్పాట్ గా మార్చుకుని తీసిన వీడియోలపై సీఎంఓ అధికారులు సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.