కల్వకుంట్ల కవితపై ఈసీకి కాంగ్రెైస్ ఫిర్యాదు | congress complaint to ec on kavitha| code| violate| appeal| vote
posted on Nov 30, 2023 8:36AM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీకల్వకుంట్ల కవితపై కాంగ్రెైస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనీ, ప్రజలకు పోలింగ్ బూత్ వద్ద తమ పార్టీకే ఓటేయాల్సిందిగా విజ్ణప్తి చేశారనీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కవిత ఓటర్లకు విజ్ణప్తి చేయడం కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆయన అన్నారు. అందుకే ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఇదిలా ఉండగా తెలంగాణ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మెరాయించాయి. సిద్దిపేటలోని అంబి టస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నెం.118 లో ఈవీఎం మొరాయించింది.
మాక్ పోలింగ్ సజావుగా సాగినా, పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తిందని చెబుతున్నారు. అలాగే నిజామాబాద్ లోని నందిపేట మండల కేంద్రంలో, సూర్యాపేట విద్యానగర్ లో, నాగార్జునసాగర్ లో ఈవీఎంల మొరాయింపు కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.