క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎప్పుడంటే? | quash not listed| fiber| net| babu| anticipatiry| bail
posted on Nov 30, 2023 10:47AM
ఫైబర్ నెట్ కేసులు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (నవంబర్ 30) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్దబోస్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే గతంలో ఇదే ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఆ సందర్భంగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించిన అనంతరం ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారిస్తామని పేర్కొంది.
అయితే సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ గురువారం (నవంబర్ 30) లిస్ట్ కాలేదు. కానీ ఫెబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్ లిస్ట్ అయ్యింది. దీంతో క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించక ముందే సుప్రీం ధర్మాసనం ఫెబర్ నెట్ కేసులో బాబు ముందస్తు పిటిషన్ పై విచారణ జరపనున్నదని భావించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఫైబర్ నెట్ కేసు విచారణ ధర్మాసనం ముందుకు వచ్చిన ప్రతిసారీ న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్దబోస్ లు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించిన అనంతరమే ఈ పిటిషన్ విచారణ చేపడతామని చెబుతూ వచ్చారు. అలాగే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే వరకూ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ సీఐీని ఆదేశించారు.
అయితే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకుండానే ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు రావడంతో.. ఇప్పుడు కూడా ఈ కేసు విచారణకు సుప్రీం వాయిదే వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని న్యాయనిపుణుులు అంటున్నారు. క్వాష్ పై తీర్పు వెలువడకుండా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిలుపై నిర్ణయం వెలువడే అవకాశం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై జగన్ సర్కార్ బనాయించిన అన్ని కేసుల విచారణ కూడా క్వాష్ పిటిషన్ తీర్పు కోసమే వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి విదితమే.
చివరాఖరికి ఏపీ సర్కార్ దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ కూడా ఈ కారణంతోనే వాయిదా పడిన సంగతి విదితమే. 17ఏ చంద్రబాబుకు వర్తించకపోతే ఆయనను ఎన్నికల్లో కట్టడి చేయడానికి ఎన్ని కేసులైనా పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రెడీగా ఉంది. అదే చంద్రబాబుకు 17ఏ చంద్రబాబుకు వర్తిస్తే జగన్ సర్కర్ పెట్టిన కూసులన్నీ దూది పింజెలుగా ఎగిరిపోవడం తథ్యం.