Leading News Portal in Telugu

కాంగ్రెస్ దే ఆధిక్యం అన్న ఆరా ఎగ్జిట్ పోల్ | ara exit poll says congress lead| brs| bjp| lack


posted on Nov 30, 2023 5:18PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన వివిధ సంస్థలు కొన్ని స్థానాలు తేడా వినా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోబోతున్నదనే పేర్కొన్నాయి. ఆరా సర్వే సంస్థ అయితే కాంగ్రెస్ ఈ సారి  58-67 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక అధికార బీఆర్ఎస్ 41 నుంచి 41 స్థానాలలో విజయం సాధించి అధికారానికి దూరం అవుతుందని పేర్కొంది. బీజేపీ అయితే 5 నుంచి 7 స్థానాలకు పరిమితమౌతే ఇతరులు 7 నుంచి 9 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది.  

సీప్యాక్ 

సీప్యాక్ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టింది. సీప్యాక్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 65 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. బీఆర్ఎస్ 41 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరంగా నిలుస్తుంది. బీజేపీ నాలుగు స్థానాలలోనూ, ఇతరులు 9 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశాలున్నాయని సీప్యాక్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.