Leading News Portal in Telugu

కాంగ్రెస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేదెవరంటే? | who will swornin as cm| revanth| bhatti| congress| hi| command| clp| leader


posted on Dec 3, 2023 4:30PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. ఈ మార్కు కంటే కాంగ్రెస్ మరో 4 సీట్లు ఎక్కువే గెలిచింది.

దాంతో సోమవారం (డిసెంబర్ 4)  తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించేందుకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటున్నారు. ఆదివారం  రాత్రికి కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం  ఉదయం గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరే అవకాశం ఉంది. సీఎం పదవి అప్పగిస్తే బాధ్యతగా స్వీకరిస్తానన్న భట్టి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. కాగా కాంగ్రెస్ విజయంలో అత్యంత కీలక భూమిక పోషించిన రేవంత్ కే పార్టీ హై కమాండ్ సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.