Leading News Portal in Telugu

ఈటల రాజేందర్‌ కు మొదటి పరాజయం! | etela rajender first defeat| huzurabad results| telangana election results| etela rajender| telangana results 2023| huzurabad assembly constituency| telangana assembly 2023


posted on Dec 3, 2023 3:10PM

తెలంగాణలో అపజయం ఎరుగని నేతల్లో ఈటల రాజేందర్‌ ఒకరు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల.. ఈ 20 ఏళ్లలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు కలిపి ఏడు సార్లు పోటీ చేయగా.. ఏడూ సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఈటలకు మొదటిసారి పరాజయం ఎదురైంది.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఈటల 2004లో కమలాపూర్‌ నుంచి పోటీ చేసి మొదటిసారి గెలుపొందారు. 2008 ఉప ఎన్నికలో మరోసారి కమలాపూర్‌ నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలో, 2014 ఎన్నికల్లో,  2018 ఎన్నికల్లో వరుసగా హుజూరాబాద్‌ నుంచి గెలుపు జెండా ఎగురవేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన, 2021 ఉప ఎన్నికలో కూడా హుజూరాబాద్‌ నుంచి విన్ అయ్యారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల హుజూరాబాద్‌ తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేయగా రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.