Leading News Portal in Telugu

మాజీ నక్సల్ దంపతుల ఆత్మహత్య యత్నం | former naxal pair suicide attempt| malyala| nanmda|| padma| land| bribe


posted on Dec 11, 2023 3:25PM

ఆజ్ణాతంలో పని చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి సాధారణ జీవనం  సాగిస్తున్న మాజీ నక్సల్ జంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజన్న రాజన్న సిరిసిల్ల సంచలనం సృష్టించింది. గతంలో జిల్లాలో జనశక్తి తీవ్రవాద సంస్థలో పని చేసిన  దంపతులు మల్యాల నందం, ఆయన భార్య  పద్మ సిరిసిల్ల జిల్లా  కొండాపూర్ లో  ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు.

  లొంగిపోయిన తరువాత నందంకు అప్పటి ప్రభుత్వం కొండాపూర్ శివారులోని సర్వే నెంబర్ 116ఏలో ఎకరం 20 గుంటల భూమిని కేటాయించింది. గత పదేళ్లుగా ఇదే భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నందం నుండి భూమిని లాక్కునేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రయత్నిస్తోందని గత కొంత కాలంగా నందం ఆరోపిస్తున్నారు.

భూమి కావాలంటే రూ. 50 వేల రూపాయలు ఇవ్వాలనీ లేకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటామనీ సర్వేయర్ కుమార్  వేధింపులకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే భూమి కోల్పోతామన్న భయంతో నందం దంపతులు  సోమవారం నందం వారి భూమి వద్ద  వివిధ శాఖల అధికారులు ఫెన్సింగ్ వేస్తున్న క్రమంలో  పద్మలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.