పవన్ కళ్యాణ్ తో కేశినేని చిన్ని భేటీ.. ఏం జరుగుతోంది? | Kesineni Chinni meets pawan kalyan| kesineni chinni offers to work with Pawan Kalyan| Kesineni Chinni On Pawan Kalyan Proposal Over Alliance
posted on Dec 12, 2023 11:01AM
చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీకి మరియు శ్రేణులకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మద్దతును ప్రత్యేకంగా అభినందించిన కేశినేని చిన్ని..
పార్లమెంటు పరిధిలో చిన్ని చేస్తున్న సేవలు అన్నా క్యాంటీన్లు మెడికల్ క్యాంపులు ఇతర సేవా కార్యక్రమాలను అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. వన సమారాధనల పేరిట ఇతర కార్యక్రమాలతో జనసేన టిడిపి కలసి ప్రయాణం చేస్తున్న వైనాన్ని వివరించిన చిన్ని..
ఉద్దానం కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పార్లమెంటు పరిధిలోని ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు చేసిన సేవలను వివరించిన చిన్ని..
ఏ కొండూరు మండలంలోని తండాలను పర్యటించి బాధితులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరిన చిన్ని..