Leading News Portal in Telugu

గోరంట్ల బుచ్చయ్యా.. నీ మాటలు అక్షర సత్యాలయ్యా! | gorantla butchayya criticize jagan| ap| cm| use| throw| uncomparable| sharmila| vijayamma| viveka


posted on Dec 26, 2023 11:00AM

ఏమాటకామాటే చెప్పాలి.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటల్లో ఓ విధమైన పదను ఉంటుంది. ఆయన వయస్సు  డైబ్బై ఏడేళ్లపైనే ఉన్నా… ఆయనగారి మాటల్లో మాత్రం పదును, చరుక్కు.. చమక్కు తాలుకు వాడి వేడి.. ఇసుమంతైనా తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే.. వయస్సుతోపాటు ఆటోమెటిక్‌గా పెరుగుతూనే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రస్తావిస్తూ.. ఎక్స్ వేదికగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి  ఓ ట్విట్ చేశారు. ప్రభాస్‌ను కరెక్ట్‌గా వాడుకున్న దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ మాత్రమేనని.. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ను దర్శకులు రాజమౌళి, వినాయక్ వాడుకున్నారని.. .. ప్రిన్స్ మహేశ్ బాబుని పూరీ జగన్నథ్ వాడుకున్నారని.. ఇక అల్లుఅర్జున్‌ను వాడుకొంది మాత్రం సుకుమార్ అని.. అలాగే బాబాయి, తల్లి, చెల్లిని కరెక్ట్‌గా వాడుకున్నది మాత్రం వైసీపీ అధినేత  జగన్ అంటూ ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్ వెంటనే వైరల్ అయ్యింది.  ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో  స్పందిస్తూ ఆయన మాటలు అక్షర సత్యాలని ప్రస్తుతిస్తున్నారు.  ప్రస్తుత  రాజకీయ నాయకుల్లో జగన్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంటున్నారు.  సొంత బాబాయ్  వివేకానందరెడ్డి, కన్న తల్లి  విజయమ్మ, సొంత సోదరి   షర్మిలలను అలా వాడుకొనే.. ఆ తర్వాత వారిని వదిలేశారని.. అందుకే తల్లీ చెల్లీ  రాష్ట్రం వదిలి తెలంగాణకు వలస వెళ్లిపోయారనీ,  సొంత చిన్నాన్న   వివేకానందరెడ్డి.. అత్యంత దారుణంగా హత్యకు గురి అయితే.. ఆయన హత్యను నాటి ప్రతిపక్ష నేతగా ఇదే  జగన్.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, నాటి సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై నెట్టి.. తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా… తన చిన్నాన్న హత్య కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తేనే.. ఈ కేసులో నిందితులు బయటకు వస్తారని..  ఈ హత్య వెనుక ఉన్న పాత్రధారులు. సూత్రధారులు సైతం వెలుగులోకి వస్తారంటూ  నానా యాగీ చేయడమే కాకుండా చిన్నన్న హత్యను ఎన్నికలలో తన విజయానికి ఒక సానుభూతి అస్త్రంగా వాడుకున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.  

అయితే జగన్ అధికార పీఠం ఎక్కి నాలుగున్నరేళ్లు గడిచినా.. ఆయన కుటుంబంలో.. అది కూడా తండ్రి తర్వాత తండ్రి అంత వాడు అయిన చిన్నాన్నను అత్యంత దారుణంగా హత్య ేచసిన  నిందితులను నేటికి పట్టుకొలేదంటే… వైయస్ జగన్ ఎంతటి స్వాతి ముత్యమో అర్థమవుతున్నదని  పేర్కొంటున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. గోదావరి జిల్లాలో సైకిల్ చక్రమే కాదు.. రాజకీయ చక్రం తిప్పిన ఘనాపాటి అని… అందుకే అసెంబ్లీకి జరిగిన పలు ఎన్నికల్లో చాలా సార్లు ఆయన గెలుపొందారని వారు గుర్తు చేస్తున్నారు.  

ఈ రాజమండ్రి గ్రామీణ తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఓ డైలాగ్ రైటర్ ఉన్నారని.. ఆయన గారి ఈ డైలాగులు చూస్తే…. అటు పరిచూరి బ్రదర్స్, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు హోల్ సేల్‌గా టాలీవుడ్ వదిలి పారిపోతారనే అంటున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే ఓ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నాయకుడని.. అలాంటి గట్స్ ఉన్న  ఈ ఎమ్మెల్యే.. సాక్షాత్తూ ఏపీ అసెంబ్లీలోనే.. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను.. నీకు మంగలి కృష్ణా తెలుసా? అంటూ ఆట పట్టించారని… దీంతో నాటి సభలోని ఫ్యాన్ పార్టీ సభ్యులంతా డంగై పోయారని వారు గుర్తు చేస్తున్నారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్‌తో రాజమౌళి ఛత్రపతి, బాహుబలి వన్, టూ చిత్రాలు తీశారు… అలాగే సలార్ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ట్రిపుల్ ఆర్ చిత్రాల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని హీరోగా పెట్టి రాజమౌళి సినిమాలు తీశారని.. అదే విధంగా ఇదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆది, ఆదుర్స్ చిత్రాలు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చాయి. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా పోకిరి, బిజినెస్‌మెన్ చిత్రాలు వెండి తెర మీద సందడి చేశాయి.. అల్లు అర్జున్ హీరోగా   దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం పుష్ప 1. 

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌లోని నటనను బయటకు రాబట్టడంలో..దర్శకుడు నూటికి నూరు శాతం విజయం సాధించాడని.. అందుకే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారని.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందేనని.. అలాగే ఫ్యాన్ పార్టీ   జగన్‌ సైతం.. గత ఎన్నికల్లో గెలుపొందడం కోసం.. చిన్నాన్న వైయస్ వివేకా నందరెడ్డి హత్యను, అలాగే చెల్లి వైయస్ షర్మిలను, తల్లి వైయస్ విజయమ్మను బాగానా వాడుకొని.. ముఖ్యమంత్రి పీఠాన్ని వైయస్ జగన్ ఎక్కారంటే.. ఆయనలో మోస్ట్ ఫవర్ పుల్ టాలెంట్ ఉందనే విషయం ఇట్టే అవగతమవుతోందని నెటిజన్లు వివరిస్తున్నారు.