Leading News Portal in Telugu

కరోనా కారణంగా హైదరాబాద్ లో  తొలి మరణం 


posted on Dec 26, 2023 12:32PM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ  విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 412 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్య కారణాలో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజటివ్ అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృత్యువాత పడ్డాడు. ఊపిరితిత్తుల వ్యాధితో సదరు వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. కరోనా కారణంగా తెలంగాణలో ఈ ఏడాది నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో… దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.