Leading News Portal in Telugu

నా హత్యకు కుట్ర: బిటెక్ రవి 


posted on Dec 29, 2023 4:10PM

తనను హత్య  చేయడానికి ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్ర పన్నారని పులివెందుల టిడిపి ఇన్ చార్జి బిటెక్ రవి ఆరోపించారు. తన గన్ మెన్లను తొలగించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాకున్న ఇద్దరు గన్ మెన్ లు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు. నాకు ప్రాణ హాని ఉందని ఇందుకు జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బిటెక్ రవి హెచ్చరించారు.