బౌద్ధ వారసత్వాన్ని కాపాడుకోవాలి.. డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి | preserve Buddhist heritage| doctor| emani| sivanagireddy| maharashtra| department
posted on Jan 20, 2024 3:43PM
భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసిన బౌద్ధ వారసత్వానికి కాపాడుకోవాలి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర పురావస్తు శాఖ, సావిత్రీ పులె విశ్వవిద్యాలయం(పుణె) సంయుక్తంగా నిర్వహించిన మహారాష్ట్ర బౌద్ధ వారసత్వం అన్న అంతర్జాతీయ సదస్సులో ఒక విభాగానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మహారాష్ట్రలో బౌద్ధ గుహలు.. సాంకేతిక అంశాలు అన్న అంశంపై శనివారం (జనవరి 19) ప్రసంగించారు.
క్రిస్తుపూర్వం 2- క్రీస్తు శకం 7 శతాబ్దాల మధ్య పశ్చిమ మహారాష్ట్లో 1200 బౌద్ధగుహలున్నాయనీ, బౌద్ధ భిక్షువులు వారి నివాసం కోసం తొలచి, బౌద్ధ చిహ్నాలు, బుధ్ధ, బోధిసత్వ శిల్పాలు, చిత్రాలు తీర్చిదిద్దారని అన్నారు. కాగా సదస్సు నిర్వాహకులు డాక్టర్ శివనాగిరెడ్డిని సత్కరించారు.