కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి | attack on kanna| lakshminarayana| palnadu| tondapi| babu| garuntee| future
posted on Jan 29, 2024 8:59AM
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, సత్తెనపల్లి ఇన్ చార్జ్ కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కన్నా పిఏ స్వామి, పలువురు తెలుగుదేశం నాయకులు గాయపడ్డారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపి గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఈ దాడికి పాల్పడింది వైసీపీ గూండాలేనని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీకి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే దాడికి పాల్పడ్డారని అంటున్నారు. ఈ దాడి ఒక పథకం ప్రకారం జరిగిందనీ, లైట్లు ఆర్పేసి చుట్టుపక్కల భవనాలపై నుంచి రాళ్లదాడికి పాల్పడ్డారు.
వైసీపీ రౌడీ ఇజానికీ, గూండాయిజానికి భయపడే ప్రశక్తే లేదని కన్నా ఈ సందర్భంగా చెప్పారు. ఓటమి ఖరారైన నైరాశ్యంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలలో ఓటమి భయంతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.