పులివెందులలో జగన్ కు పొంచి ఉన్న ఓటమి? సొంత సోదరే ప్రత్యర్థి | hard time to jagan in kadapa| sharmila| sunita| pulivendula| assembly| kadapa| loksabha
posted on Feb 1, 2024 8:06AM
రాయలసీమలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని నిర్ధారణ అయిపోయింది. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ షర్మిల, బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత నుంచి ఆయనకు ఓటమి భయం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తన రాజకీయ భవిష్యత్ ను కాపాడుకోవడం కోసమే షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిందన్న భావన రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యేది. ఆమె జగన్ సర్కార్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కూడా కాంగ్రెస్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమేననీ, ఆమె లక్ష్యం రాజ్యసభకు వెళ్లడమనీ విశ్లేషణలు చేశారు. అయితే ఆమె నేరుగా అన్న జగన్ తో తలపడి తాడో పేడో తెల్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని ఇప్పుడు తేటతెల్లమైపోయింది.
కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా ఆమె అన్నతో ఆయన సొంత నియోజకవర్గం నుంచే ప్రత్యర్థిగా నిలబడేందుకు రెడీ అయిపోయారని ఇప్పుడు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజన్న బిడ్డగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారస్వాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. సొంత అన్న నుంచి తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకునేందుకే షర్మిల ఈ స్థాయిలో పులివెందుల బరిలో షర్మిల కన్ షర్మ్?.. కడప లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ సునీత
ఆయనతో తలపడేందుకు ఆమె సిద్ధమయ్యారని చెబుతున్నారు.
మరో వైపు షర్మిల బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కూడా తన తండ్రి హంతకులకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూ.. తన న్యాయపోరాటంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న జగన్ పై రాజకీయ పోరాటానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన అవినాష్ రెడ్డిపై నిలబడి తలపడేందుకు రెడీ అయిపోయారు. అంటే జగన్ సొంత సోదరి పులివెందుల నుంచి అసెంబ్లీకి, బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత కడప లోక్ సభ నియోజకవర్గం నుంచీ రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారనీ, తద్వారా సొంత జిల్లాలో జగన్ కు తేరుకోలేని, గుక్కతిప్పుకునే అవకాశం లేని దెబ్బ కొట్టాలని షర్మిల, సునీత భావిస్తున్నారని అంటున్నారు. ఈ పేపథ్యంలోనే ఇటీవల ఇరువురూ ఇడుపుల పాయలో భేటీ అయ్యారు. ఆ భేటీలోనే సునీత కడప లోక్ సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలనీ, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల సొంత అన్న జగన్ కు ప్రత్యర్థిగా రంగంలోకి దిగాలని నిర్ణయంచినట్లు వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన వారు చెబుతేన్నారు. అదే జరిగితే ఆ ప్రభావం ఆ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదనీ, జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
షర్మిల, సునీతలు జగన్ కు వ్యతిరేకంగా కడప జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగితే.. గత ఎన్నికలలో వైఎస్ వివేకా హత్య అంశం వైసీపీ విజయానికి ఎంతగా దోహదపడిందో.. అంతకు రెట్టింపు రానున్న ఎన్నికలలో ఆ పార్టీ పరాజయానికి చేరువ చేస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికలలో వైఎస్ వివేకా హత్యను అడ్డుపెట్టుకుని జనం సానుభూతిని సంపాదించుకుని విజయం సాధించిన జగన్ కు ఇప్పుడు అదే వివేకా హత్య కేసు యాంటీ సెంటిమెంట్ గా మారి పుట్టి ముంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన అనంతరం తల్లి, చెల్లిని దూరం పెట్టడంతో జగన్ తీరు ప్రజలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గత ఎన్నికలలో తన విజయం కోసం అహర్నిశలూ శ్రమించిన సొంత చెల్లి, తల్లిని జగన్ దూరం పెట్టడాన్ని ఏరు దాటి తెప్పతగలిసినట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. దీంతో పులివెందులలో షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా, జగన్ ప్రత్యర్థిగా రంగంలోకి దిగితే.. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలకు షర్మిలను దూరంపెట్టడానికి, పార్టీ నుంచి బయటకు పంపేయడానికి సరైన కారణాలు చెప్పి మరీ వివరణ ఇచ్చు కోవాల్సి ఉంటుంది. అదలా ఉంచితే…
తన తండ్రి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలన్న లక్ష్యంతో అలుపెరుగని సునీత న్యాయపోరాటానికి ప్రజా మద్దతు గట్టిగా ఉంది. వైఎస్ వివాకా హత్య విషయంలో గత ఎన్నికలకు ముందు ఒకలా, విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో డాక్టర్ సునీత పట్ల ప్రజలలో సానుభూతి వ్యక్తం అవుతోంది. అదే జగన్ పార్టీకి కడప జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలేందుకు కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.