Leading News Portal in Telugu

పేపర్‌ లీకేజీ వెనుక పెద్ద హస్తం ఉందా? 


posted on Feb 2, 2024 4:46PM

కేటీఆర్ పీఏ తిరుప‌తికి – గ్రూప్ వ‌న్ పేప‌ర్ లీక్ కి లింక్ ఏమిటి? భారీ ఎత్తున పోస్టుల‌కు సంబంధించి బేరం పెట్టిందెవ‌రు?  హనీ ట్రాప్ లో ప‌డిన ఆ పెద్ద చేప ఎవ‌రు? పేపర్‌ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉందా? 

గ్రూప్ 1 పేపర్‌ లీకేజీ వ్యవహారంపై  మొదట హ్యాక్‌ అయిందన్నారు. తర్వాత హనీట్రాప్‌ జరిగిందన్నారు.ఆ త‌రువాత‌ లీకైంద‌న్నారు. అస‌లు వాస్త‌వాలేమిటి? ఈ వ్య‌వ‌హారంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. 

ఇప్పటికే అనేక మలుపు తీసుకున్న ఈ కేసులో ఎన్నో ట్విస్ట్‌లున్నాయి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆశ్చర్యపోయే నిజాలు బహిర్గతం అవుతున్నాయి. 

1. గ్రూప్ వ‌న్ పేప‌ర్ లీక్ ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన రేణుక నుంచి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రస్తుతం వనపర్తి గురుకుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన తమ్ముడు రాజేశ్వర్‌ నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం తెప్పించేందుకు తన భర్త ఢాక్యానాయక్‌, టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి ప్రవీణ్‌తో కలిసి ప్లాన్ చేసి దొరికిపోయారు.

2. ఈ ప్ర‌వీణ్ ఎవ‌డు?ప్రవీణ్ టీఎస్‌పీఎస్‌సీలో కారుణ నియామకం ఉద్యోగం సంపాదించాడు. తన తండ్రి హరిచంద్రరావు విధి నిర్వహణలో మరణించగా.. ఆ ఉద్యోగం ప్రవీణ్‌కు వచ్చింది. సెక్ర‌ట‌రీ పి.ఏ.గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు.

3. ప్ర‌వీణ్‌కు రేణుక‌తో లింక్ ఏమిటి?

గతంలో రేణుక గురుకుల టీచర్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో దరఖాస్తులో కొన్ని తప్పులు దొర్లాయి. వాటిని ఆమె సరిదిద్దుకునేందుకు ఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు వెళ్లారు. అప్పుడే ప్రవీణ్‌ పరిచయం అయ్యాడు. అతని నెంబరు తీసుకుని అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. ఈ పరిచయంతోనే తన తమ్ముడు రాజేశ్వర్ నాయక్‌ కోసం పేపర్ లీక్ చేయాలని అడిగింది. 

4. త‌మ్ముడి కోసం అక్క డీల్‌

ఆమెతో డీల్ కుదుకుర్చుకున్న ప్రవీణ్‌.. ఐపీ అడ్రస్‌ను తెలుసుకుని నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డితో కలిసి టౌన్ ప్లానింగ్ క్వశ్చన్ పేపర్‌ను సేకరించాడు. ప్రశ్నాపత్రాన్ని పెన్‌డ్రైవ్‌లలో సేవ్ చేసుకుని.. రేణుకకు 10 లక్షల రూపాయలకు అమ్మేశాడు. రేణుక దంపతులు ఈ ప్రశ్నాపత్రాలను 40 లక్షల రూపాయలకు ఇతర అభ్యర్థులకు విక్రయించాడు.  

గ్రూప్ వ‌న్ పేపర్ ను లీక్ చేసి రేణుకకు ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్.. 

నమ్మకమైన వారికే అమ్మాలని సూచించాడు. ఆమెతో రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకొని అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు తీసుకున్నాడు. 

రేణుక  ఏఈ పేపర్‌ను త‌మ్ముడు రాజేశ్వర్‌కు ఇచ్చింది.మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ. 40 లక్షలకు విక్రయించాడు.  అభ్యర్థులై గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్‌ల నుంచి రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న రాజేశ్వర్.. మిగతా డబ్బులు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.  అందులో రూ.10 లక్షలు డాక్యా నాయక్‌కు ఇచ్చాడు. రాజేశ్వర్ ఇచ్చిన రూ. 10 లక్షల్లో నుంచి రూ. 5 లక్షలను డాక్యా నాయక్‌ ప్రవీణ్‌కు ఇచ్చాడు. 

5. మ‌రి ఈ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఎవ‌డో తెలుసుకోవాలంటే….

కేటీఆర్ పీఏ తిరుప‌తి గురించి మాట్లాడుకోవాల్సిందే. ఏ2గా ఉన్న రాజ‌శేఖర్ రెడ్డి ది – 

పీఏ తిరుప‌తిది ది ప‌క్క ప‌క్క ఊర్లేన‌ట‌. అస‌లు రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి టీఎస్ పీఎస్సీలో ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్‌ పీఏ తిరుప‌తినే. ఒక్క మాట‌లో చెప్పాలంటే

కేసీఆర్ కు షాడో సీఎం కేటీఆర్ అయితే కేటీఆర్ కు షాడో మంత్రి తిరుప‌తి అలా న‌డిచింద‌ప్ప‌ట్లో.కేటీఆర్ పీఏ తిరుప‌తి, నిందితుడు రాజ‌శేఖ‌ర్ స‌న్నిహితులంద‌రికీ గ్రూప్ -1 లో ఎక్కువ మార్కులు వ‌చ్చాయి. అంటే తిరుప‌తికి – గ్రూప్ వ‌న్ పేప‌ర్ లీక్ కి లింక్ ఏమిట‌ని సిట్ గ‌ట్టిగానే త‌వ్వుతోంది.ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసు. వాళ్లెవ‌రంటే…

6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, 

7. ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు 

అయితే ఈ విషయం తెలుసుకున్న 

ప్రవీణ్, రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజి అంశం ఉన్నతాధికారులకు చెబుతారేమో అని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్ లను ప్రలోభపెట్టారు.

మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని..మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవచ్చని 

ప్రవీణ్, రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీనితో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ తీసుకున్నారు. 

షమీమ్, రమేష్ ల నుండే 

8. న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు, 

9. సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ చేశారు. 

10. సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి

అస‌లెలా జ‌రిగిందంటే 

సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి సిస్టమ్ లోకి జూన్‌‌‌‌లోనే గ్రూప్‌‌‌‌1 క్వశ్చన్‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అదే సమయంలో రాజశేఖర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలోనే శంకరలక్ష్మి సిస్టమ్ నుంచి గ్రూప్‌‌‌‌ 1 పేపర్‌‌‌‌‌‌‌‌ హ్యాక్ చేశాడు. ఈ పేపర్‌‌‌‌‌‌‌‌ను ప్రవీణ్‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌ తమకు తెలిసిన వారికి అమ్ముకున్నారు.

రాజశేఖర్ రెడ్డి సాయంతో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి కొట్టేశాడు. 

పెన్‌డ్రైవ్‌లో పేపర్లు సేవ్ చేసుకున్నాడు.

టౌన్ ప్లానింగ్, 

బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, 

అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ , 

గ్రౌండ్ వాటర్ ఇన్స్‌పెక్టర్ పోస్టుల పేపర్లను తన దగ్గర పెట్టుకున్నాడు ప్రవీణ్. 

సమయం చూసి పేపర్లను విక్రయించేందుకు ప్రవీణ్ ప్లాన్ చేశాడు. 

టీచ‌ర్ రేణుక‌తోనూ మాట్లాడాడు. తాను గ‌తంలో భవిష్యత్తులో జరిగే పరీక్షా పత్రాలు ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చి వున్నాడు. కాబ‌ట్టి అభ్యర్ధులను వెతికి బేరమాడి పెట్టాలని రేణుకకు చెప్పాడు ప్రవీణ్. 

ప్రవీణ్‌ కింగ్ పిన్‌గా మారాడు.  మహిళలతో వ్యవహారాలు నడుపుతూ అడ్డగోలు దందా చేశాడు. ప్రవీణ్ ఫోన్‌లో విచ్చలవిడిగా నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్‌లను పోలీసులు గుర్తించారు.  

హనీ ట్రాప్ జ‌రిగింద‌నే ప్ర‌చారం వుంది.

రేణుక భర్త ఢాక్యానాయక్‌ ద‌గ్గ‌ర గ్రూప్ వ‌న్ పేప‌ర్ కొన్న గండీడ్ కు చెందిన తిరుపతయ్యను సిట్ పోలీసులకు దొరికాడు. 

రమేష్ నుంచి పేప‌ర్ కొన్న ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్  పోలీసుల‌కు దొరికారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కు చేరింది.

తెలంగాణా ప‌బ్లిక్‌ స‌ర్వీస్ కమీషన్ లో పని చేసే ఎంత మంది గ్రూప్‌వ‌న్ రాశారు?

ప్రవీణ్  తో పాటు మరో 10 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యారు.

ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు 

మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

అయితే వీరు కమీషన్ లో పని చేస్తూనే పరీక్ష రాశారా? 

లేక సెలవులో ఉండి పరీక్ష రాశారా అనేది తెలియాల్సి ఉంది. 

అలాగే పరిక్ష రాయడానికి వీరు కమిషన్ నుండి అనుమతి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వీరికి కూడా ప్రశ్నాపత్రం లీక్ అయిందా అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజశేఖర్, ప్రవీణ్, రేణుకకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.

నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో తెలంగాణ ఉద్య‌మం మొద‌లైంది. 

తొలి చైర్మ‌న్ గా ఘంటా చ‌క్ర‌పాణి సార‌థ్యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించినా 

ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎంపికైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

కానీ ఆయ‌న వాటిని ఖండించారు. నోటిఫికేష‌న్లు వేయ‌డం , కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌డం , ఆ త‌ర్వాత య‌ధావిధిగా వాయిదా ప‌డ‌డం ష‌రా మామూలై పోయింది. 

గ‌తంలో జిల్లా స్థాయిలో ఎంపిక క‌మిటీ ఉండేది. కానీ ప్ర‌తి పోస్టును టీఎస్పీఎస్సీ ద్వారానే అప్ప‌గించ‌డం కొలువుల ఎంపిక‌లో తాత్సారం జ‌రుగుతూ వ‌చ్చింది. బీఆర్ఎస్ రెండోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చినా ఉద్యోగాల నియామ‌కాల విష‌యంలో ఆస‌క్తి క‌న‌బ‌ర్చ లేదు. ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురు చూస్తూ వ‌చ్చారు.  అయితే అసెంబ్లీ సాక్షిగా గ‌త‌ సీఎం 85 వేల పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు టీఎస్పీఎస్సీకి బి. జ‌నార్ద‌న్ రెడ్డిని చైర్మ‌న్ గా ఎంపిక చేశారు. హ‌డావుడిగా నోటిఫికేష‌న్లు జారీ చేశారు.