Leading News Portal in Telugu

సంసద్ రత్న కింజారపు రామ్మోహన్ నాయుడు | kinjarapu rammohan naidu samsad ratna| award| young| age| record| dedicate| tdp


posted on Feb 12, 2024 5:49AM

శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సంసద్ రత్న. ఔను ఎంపీల పనితీరు ఆధారంగా ఇచ్చే సంసద్ రత్న అవార్డుకు శ్రీకాకుళం తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు.  పార్లమెంట్ సభ్యునిగా ఆయన కనబర్చిన ప్రతిభకు ఈ పురస్కారం దక్కింది. అంతే కాదు.. అతి పిన్న వయస్సులో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి ఎంపీగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు.  

కాగా తాను సంసద్ రత్న పురస్కారం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ పురస్కారాన్ని తెలుగుదేశం శ్రేణులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.   సంసద్ రత్న అవార్డ్స్ 2020కి గానూ మొత్తం 10 మంది ఎంపీలను ఎంపిక చేశారు.  

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ  ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సూచనతో 2010 నుంచి ఈ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.