posted on Feb 14, 2024 3:51PM
రానున్న లోకసభ ఎన్నికలలో ఖమ్మం లోకసభ స్థానం నుంచి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే ఈ వార్తలను కాంగ్రెస్ హై కమాండ్ పటా పంచలు చేసింది.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు. అనిల్ కుమార్ యాదవ్ లకు రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధకారిక ప్రకటన వెలువడింది. మరోవైపు కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ లకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేరును ఖరారు. వీరి అభ్యర్థిత్వాలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఏఐసీసీ తెలిపింది. మరోవైపు రేణుకా చౌదరి రాజ్యసభకు వెళ్తుండటంతో… ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ;