posted on Feb 14, 2024 11:38AM
రాంగ్ రూట్ లో వచ్చే కారు బైక్ ను ఢీ కొన్న ఘటనలో హైదరాబాద్ కు చెందిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతిచెందారు. ఎస్సై కాజా వలీ మోహీనుద్దీన్ తీవ్ర గాయాలపాలయ్యారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. సాధిక్ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజా వలీ నారాయణ గూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్ట్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగాక కారు ఆపకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.