Leading News Portal in Telugu

చిత్తూరులో పడమటి సంధ్యారాగం | chittur boy married nepal girl


posted on Feb 15, 2024 11:54AM

పడమటి సంధ్యారాగం. జంధ్యాల పూర్తిగా అమెరికా నేపథ్యంలో తీసిన సినిమా.విజయశాంతి, గుమ్మలూరి శాస్త్రి, థామస్ జేన్, శివమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1987లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రాన్ని గుమ్మలూరి శాస్త్రి, మీర్ అబ్దుల్లా కలిసి ప్రవాసాంధ్ర చిత్ర పతాకంపై నిర్మించారు. చిత్ర దర్శకుడు జంధ్యాల, గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి అమెరికా పర్యటనకు వెళ్ళినపుడు నిర్మాతలకు వీరికి మధ్య జరిగిన సంభాషణ ఈ చిత్రానికి బీజం వేసింది. ఈ చిత్రంలో నటులంతా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే. చిత్రీకరణ సుమారు తొంభై శాతం అమెరికాలోనే జరిగింది. అమెరికన్ కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే. 

ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ కథా రచయితగా జంధ్యాలకు నంది పురస్కారం లభించాయి.

అప్పుడు అమెరికా అబ్బాయిని మన ఇండియన్ అమ్మాయి లవ్ స్టోరీ. కాని ఇక్కడ మన దేశంలోని ఎపి అబ్బాయి నేపాల్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

అమెరికా, జపాన్, చైనా వంటి విదేశీ అమ్మాయి మెడలో మన అబ్బాయిలు తాళి కట్టడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. అయితే, ఈసారి మాత్రం వధువు దేశం మారింది. పొరుగుదేశం నేపాల్‌కు చెందిన అమ్మాయి మెడలో చిత్తూరు జిల్లా పెనుమూరు అబ్బాయి తాళి కట్టాడు. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి మరీ తమ ప్రేమబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు.

పెనుమూరుకు చెందిన భువన్‌కృష్ణ లండన్‌లో ఉద్యోగం చేస్తుండగా, నేపాల్ అమ్మాయి జి. మనీలతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. వీరిద్దరు ఒకే  కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.  నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి కావాలని భావించారు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.  పెద్దలు సంతోషంగా వీరి ప్రేమను అంగీకరించారు. ఈ తెల్లవారుజామున చిత్తూరులోని ఓ హోటల్‌లో వీరి విహహం అంగరంగ వైభవంగా జరిగింది.