posted on Feb 19, 2024 10:52AM
సినిమా వాళ్లు రాజకీయాల్లో వస్తే ఆయా పార్టీల గ్లామర్ పెరుగుతుంది. కానీ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇటీవలె చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షపడింది. ఈ వివాదం మరువక ముందే తాజాగా మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. ఫిలింనగర్ లో బండ్ల గణేష్ గత కొంత కాలంగా అద్దెకుంటున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని నౌహీరాషేక్ చెబుతున్నప్పటికీ బండ్ల గణేష్ ఖాలీ చేయడం లేదు. 11 నెలలరెంటల్ అగ్రిమెంట్ ను బండ్ల గణేష్ ఫోర్జరీ చేసినట్లు నౌహీరా షేక్ చెబుతుంది. అద్దెకు ఒక పోర్షన్ ఇస్తే రెండో, మూడో ప్లోర్లు కూడా బండ్ల గణేష్ కబ్జా చేసినట్లు యజమాని చెబుతున్నారు. ఆమె వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని బండ్ల గణేష్ అరాచకాలు చేస్తున్నట్లు ఆమె మీడియా సమావేశంలో ఆరోపించింది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, తీన్మార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. సినీ ఇండస్ట్రీలో అనేక ఫైనాన్షియర్లను మోసం చేసిన ఆరోపణలున్నాయి. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ అనతి కాలంలోనే భారీ చిత్రాల నిర్మాత స్థాయికి ఎదిగాడు. అంతలోనే అతని గ్రాఫ్ పడిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన బండ్ల గణేష్ నటనకు దూరమై సినీ నిర్మాతగా మారి ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో రావడంతో బండ్ల గణేష్ పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. వచ్చే లోకసభ ఎన్నికల నేపథ్యంలో తాను మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని బాహాటంగానే ప్రకటించుకుని వార్తల్లోకెక్కారు. నౌహీరాషేక్ ఇంట్లో అద్దెకున్న బండ్ల గణేష్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి మరో వివాదానికి కారణమయ్యాడు. చిత్తూరు జిల్లాకు చెందిన నౌహీరాషేక్ బండ్ల గణేష్ మీద రాజకీయంగా దెబ్బతీయడానికి వ్యూహాలు రచిస్తోంది. ఆమె ఆషామాషీ మహిళ కాదు. అద్దెకు ఉంటున్న ఇంటినే ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఖాళీ చేయాలని చెప్పినందుకు తమపైనే దాడికి పాల్పడ్డారంటూ హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ నౌహీరా షేక్ సంచలన ఆరోపణలు చేశారు.రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని అద్దెకు ఇవ్వగా.. కబ్జా చేసేందుకు బండ్ల గణేశ్ స్కెచ్ వేసాడని నౌహీర్ షేక్ ఆరోపించారు. తన ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం రావటంతో.. వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లగా తమపై రౌడీలతో దాడి చేయించారని తెలిపారు.మంచి మాటతో ఇళ్లు ఖాళీ చేయాలని అడిగితే.. తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని నౌహీరా షేక్ తెలిపారు. వాళ్లే తమపై దాడి చేసి.. తిరిగి తామే దౌర్జన్యం చేస్తున్నామని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. తాము అక్కడ ఉండగానే.. పోలీసులు వచ్చి తమపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గంటల్లోని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని తెలిపారు. తనకు చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసంటూ బండ్ల గణేశ్ తమముందే ఫోన్‌లు చేశాడన్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు నౌహీరా షేక్. ఈమె కూడ నొటోరియస్ క్రిమినల్.
రేవంత్ సర్కారుకు తలనొప్పులు తేవడానికి ఆమె ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు అర్థమవుతుంది. బిఆర్ఎస్, బిజెపి, మజ్లిస్ పార్టీల సహకారం తీసుకునే యోచనలో నౌహీరాషేక్ ఆలోచన అని విశ్వసనీయంగా తెలుస్తోంది.