Leading News Portal in Telugu

చంద్రబాబుతో నారాయణ భేటీ  | Narayana met with Chandrababu


posted on Feb 27, 2024 2:51PM

టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. వచ్చే నెల 2వ తేదీన చంద్రబాబు నెల్లూరు పర్యటనపై వీరు చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ… నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులే లేరని చెప్పారు. టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని అన్నారు. 2వ తేదీన చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారో తనకు తెలియదని… సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయని… దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని అన్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఇచ్చే ఆదేశాలను అందరం పాటిస్తామని చెప్పారు.