posted on Feb 27, 2024 1:19PM
పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ధీటైన సమాధానం ఇస్తోంది. తమ అధినాయకత్వం పై ఇష్టారాజ్య ఆరోపణలు అడ్డుకట్టవేయడానికి నడుంకట్టింది. ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలకు బాధ్యులైన వారిని కోర్టుకీడ్చాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకుల నుంచి టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ బెంజ్ కారును అందుకున్నారంటూ తెలంగాణ బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై హస్తం పార్టీ స్పందించింది. ఆయనకు లీగల్ నోటీసులు పంపించింది. ఇక తనపై వచ్చిన ఆరోపణను దీపాదాస్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని దీపాదాస్ మున్షీ ఖండించారు.