Leading News Portal in Telugu

వాలంటీర్లకు ఎన్నికల విధులపై కోర్టుకు నిమ్మగడ్డ | nimmagadda to file pitition in supreme| election| duties| volunteers| against| democratic| values| fake


posted on Feb 29, 2024 2:10PM

వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కోర్టుకు వెళ్లనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిటైర్డ్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో ఓటు వేద్దం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దా అన్న నినాదంతో నిర్వహించిన కళాజాతా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ ప్రక్రియలో భాగమని చెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి సుమారు 30 వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని  ఇటీవలఆ విషయం బయటపడడంతో ఇద్దరు ఉన్నత అధికారులను సస్పెండ్‌ చేసి ఎన్నికల కమిషన్‌ చేతులు దులిపేసుకుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ దొంగ ఓట్లు ఉన్నాయన్న నిమ్మగడ్డ కనుక ప్రజలు జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో తమ ఓట్లను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధులలోకి తీసుకోవాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలకు చేర్చడం ప్రజాస్వామ్య విదుద్ధమన్న నిమ్మగడ్డ, వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకుంటామంటూ ఏపీ సీఎం జగన్, ఆయన కేబినెట్ సహచరులు చెప్పడం ఎన్నికల కమిషన్ ను అవమానించడమేనన్న ఆయన వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోరాదని కోరుతూ సుప్రీంలో కేసు వేయనున్నట్లు వెల్లడించారు. యువత తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.