Leading News Portal in Telugu

ఏపీకి 465 కంపెనీల కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు బలగాలు | ap need 465 companies central armed police forces| elections| bandobast


posted on Mar 1, 2024 11:43AM

 వచ్చే ఎన్నికలలో ఏపీలో పటిష్ట భద్రత, బందోబస్తు కోసం  465 కంపెనీల కేంద్ర ఆర్మ డ్ పోలీసు బలగాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కోరారు.

ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జవహర్ రెడ్డి ఈ మేరకు కోరారు. వచ్చే ఎన్నికలలో భద్రత బందోబస్తు కోసం 58 కంపెనీల స్పెషల్ ఆర్మ్ డ్ బలగాలు అవసరమని, ప్రస్తుతం అయితే 32 కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నారు. మరో 26 కంపెనీలు పంపాలనీ కోరారు.

వివిధ రాష్ట్రాల సీఎస్ లు, సీఈవోలు హోం శాఖ కార్యదర్శులతో అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికార ముఖేశ్ కుమార్ మీనా, హోం శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.