posted on Mar 1, 2024 10:23AM
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటూ ఇతర కీలక నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దియో సాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ – మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితాను ఈసీ నోటిఫికేషన్ కు ముందే విడుదల చేయాలని పార్టీ యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ ఎంపీ బిజెపి అభ్యర్థి ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆధ్యాత్మిక వేత నడింపల్లి యమునా పాఠక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా గతవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే స్థానాలపై చర్చలు జరిపారు.హైద్రాబాద్ ఎంపీగా మజ్లిస్ పార్టీ నుంచి వరుసగా గెలుపొందుతున్న అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టడానికి బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. పార్టీ నిర్వహించిన సర్వే నివేదికల్లో యమునాపాఠక్ పేరు వెల్లడయ్యింది. మతోన్మాదపార్టీగా బిజెపికి బలమైన ముద్ర ఉంది. కేవలం హిందూ ఓట్లతో ఆ పార్టీ గెలుపొందే అవకాశాలు తక్కువే. ఇప్పటివరకు ముస్లిం ఓట్లతో మజ్లిస్ పార్టీ గెలుపొందుతూ వస్తోంది. ఓవైసీని ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ఓల్డ్ సిటీ అడ్డా మజ్లిస్ అనే అభిప్రాయాన్ని ఆమె చెరిపి వేసే ప్రయత్నం చేస్తున్నారు మజ్లిస్ పార్టీకి కంచుకోట అయిన ఓల్డ్ సిటీలో బిజెపి గెలుపుసాధ్యమేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆమె ఇచ్చే సమాధానం వింటే ప్రతీ భారతీయుడు ఔననే అంటారు. ఎవరు చెప్పారు అండి ఓల్డ్ సిటీ అడ్డా మజ్లిస్ అని ఆమె వాదనకు దిగుతారు. హైదరాబాద్ మజ్లిస్ అడ్డా కాదని కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిరూపించింది. ముస్లింల సంక్షేమం , అభివృద్ది కోసం బిజెపి ప్రభుత్వం చేస్తున్న కృషి అంతా ఇంతా కాదని ఆమె అంటున్నారు. హైదరాబాద్ ఏ కులానికో, మతానికో, ప్రాంతానికో, జాతికో పరిమితం కాదు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక హైదరాబాద్ అని నిరూపణ అయ్యింది. హైదరాబాద్ అందరి సొత్తు అంటారామె. గంగా జమున తెహజీబ్ హైదరాబాద్ అని అంటున్నారు. బిజెపి అధికార ప్రతినిధి హోదాలో ఆమె తన గళాన్ని ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నారు.
విద్య, వైద్యం అందించడంలో మజ్లిస్ పార్టీ వైఫల్యం చెందిందని యమునాపాఠక్ ఆరోపించారు. పాత బస్తీ పురవీధుల్లో నిరక్షరాస్యత తాండవిస్తుందని, ప్రతీసారి మజ్లిస్ గెలుపొందడానికి ఇదే కారణమని ఆమె అంటున్నారు. ఓవైసీ హాస్పిటల్స్ లో పేదముస్లింలకు చికిత్స జరగడం లేదని, అమాయక ప్రజలకు ఓవైసీ దోచుకుంటున్నాడని యమునాపాఠక్ బలంగా వినిపిస్తున్నారు. ముస్లింల ఎంపవర్ మెంట్ కోసం ఆమె అనెక కార్యక్రమాలు చేపడుతున్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్దాంతాన్ని బలంగా నమ్మే వారిలో యమునా పాఠక్ అగ్రస్థానంలో నిలిచారు. అధికారికంగా ఆమె పేరు శుక్ర, శనివారాల్లో వెల్లడి కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.