posted on Mar 6, 2024 5:44PM
అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెల్చి14 శాతం ఓట్లు కూడా తెచ్చుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. కనీసం రెండంకెల సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. మొత్తం 17 సీట్లు ఉండగా, 10 నుండి 12 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెల్చి14 శాతం ఓట్లు కూడా తెచ్చుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. కనీసం రెండంకెల సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. మొత్తం 17 సీట్లు ఉండగా, 10 నుండి 12 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
మొదటగా రామమందిర సెంటిమెంట్‌ను ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లను నడపారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000మంది ఉచితంగా అయోధ్యకు వెళ్లే అవకాశాన్ని కల్పించారు.
తెలంగాణాలో బిజెపి పద్మవ్యూహంతో దూసుకు వెళుతుందట. అయితే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాట…. సీనియర్లు వర్సెస్ వలసనేతల మధ్య యుద్ధమే జరుగుతోందని చెప్పుకోవచ్చు.
వలస నేతలకే బీజేపీ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తోంది?
వలస నేతలకే టిక్కెట్లు కేటాయించడంతో తెలంగాణ బీజేపీ సీనియర్లు నేతలు రగిలిపోతున్నారు. తొలి విడత టికెట్ల పంపకం తర్వాత బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే…బీజేపీ పూర్తిగా తమ వారి కంటే బయట వారినే ఎక్కువగా నమ్ముకుంటోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బంగారు శృతి:
బీజేపీ తెలంగాణ శాఖలో టికెట్ల చిచ్చు చెలరేగుతున్నది.
ఇన్నాళ్లూ కష్టమొచ్చినా..నష్టమొచ్చినా పార్టీనే అట్టిపెట్టుకుని ఉన్న
బంగారు శృతి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని స్వయంగా వెళ్లి కలవటం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ఆమె త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారమూ జరుగుతున్నది.
డీకే అరుణ వర్సెస్ జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర టికెట్ తనకంటే తనకే అంటుండటంతో డీకే అరుణ వర్సెస్ జితేందర్‌రెడ్డి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన తాజా ఎంపీ బీబీ పాటిల్‌కు రాత్రికి రాత్రే టికెట్ ఖరారు చేశారు. పోతుగంటి రాములు కుమారుడికీ చాన్సిచ్చారు.
మురళీధర్‌రావు
మల్కాజిగిరి స్థానం దక్కకపోవటంపై పార్టీలో హార్డ్‌కోర్ నాయకుడిగా పేరున్న మురళీధర్‌రావు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.
కూన శ్రీశైలంగౌడ్,
తూళ్ల వీరేందర్‌గౌడ్ బీజేపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీరేందర్ గౌడ్ కు అసెంబ్లీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు.
ఈ సారి తమకే టికెట్లు అని పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న
సోయం బాపూరావు,
డీకే అరుణ,
రఘునందన్‌రావు టికెట్ ఖరారు చేయకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు.
మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వలస నేతలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. నల్లగొండ నుంచి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని,
ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్ ఎంపీ నామానాగేశ్వర్‌రావును,
మహబూబాబాద్ నుంచి తాజా బీఆర్‌ఎస్ ఎంపీ కవిత కాదంటే హుస్సేన్ నాయక్,
వరంగల్ నుంచి ఆరూరు రమేశ్‌ను రంగంలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
ఇప్పటికే రాష్ట్ర కీలక నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు.