అమ్మ అండ కోసం తహతహ.. గెంటేసిన సంగతి మరిచావా జగన్! | jagan want vijayamma campaign for ycp| hopes| people| oppose| accept
posted on Mar 6, 2024 8:11AM
గత ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 23 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించడం వెనుక జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్, వైఎస్ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులతో పాటు ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్ వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఐదేళ్లు గిర్రున తిరిగి మళ్లీ ఎన్నికలు సమీపించే సమయానికి సీఎం జగన్ వెంట వీరెవరూ లేరు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే మేనత్త విమలారెడ్డి మాత్రమే ఇప్పుడు జగన్ పక్కన నిలబడ్డారు. 2024 ఎన్నికలలో 2019 ఎన్నికలను మించిన విజయం సాధించి వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ కు సొంత వారెవరూ అండగా నిలబడకపోవడమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తుండటం ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంది.
సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసును.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవ తీసుకొని.. ఈ కేసు ఛేదించాల్సింది పోయి, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిలను రక్షించడానికి తన అధికారాన్నంతా దుర్వినియోగం చేశారనీ, చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి.. దేశ రాజధాని ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి.. తన తండ్రి హత్య కేసు ఛేదించడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ఈ ప్రభుత్వానికి ఓటు వేయవద్దంటూ ఆంధ్ర ఓటర్లకు ఆమె విజ్జప్తి చేశారు. అలాగే తన తండ్రి హత్య ఛేదించడంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్బంగా గట్టగానే ఎండగట్టారు.
ఇది చాలదన్నట్లు జగన్ సిట్టింగ్ ల మార్పు పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. పలువురు సిట్టింగులు, ఎంపీలూ జగన్ పార్టీని వీడి తమదారి తాము చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ బయటకు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూనే లోలోపల ఓటమికి సిద్ధపడిపోయారన్న ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీ విజయం కోసం జగన్ చివరి ప్రయత్నంగా వైసీపీ మాజీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను మళ్లీ రంగంలోకి దింపాలన్న యోచన చేస్తున్నారని పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేయాల్సిందిగా ఆమెను కోరుతున్నారని అంటున్నారు. అదీకాక వైయస్ జగన్‌కు మద్దతుగా వైయస్ విజయమ్మ రంగంలోకి దిగి మళ్లీ ప్రచారం చేసేందుకు ప్రజల మధ్యకు వస్తే.. ఆమెకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని, జగన్ గద్దెనెక్కిన ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పలు విధాలుగా ఇబ్బందులు పడ్డారని… అలాంటి సమయంలో.. వైఎస్ విజయమ్మ అటు వైపు తొంగి చూసిన దాఖలాలు లేవనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాంటి వేళ కుమారుడు వైఎస్ జగన్‌కు వరుసగా రెండో సారి అధికారం కట్టబెట్టడం కోసం వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. అదీ కాక పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె చేత రాజీనామా చేయించి పక్కరాష్ట్రానికి తరిమేసిన సంగతిని ఇప్పుడు తన కన్వీనియెన్స్ కోసం జగన్ మరచిపోయినా, జనం మర్చిపోరనీ, మర్చిపోలేదనీ అంటున్నారు. ఆ విషయాన్ని మరచి కుమారుడి కోసం మళ్లీ ఏపీ రాజకీయాలలోకి విజయమ్మ అడుగుపెడతారా అన్నది కూడా అనుమానమే అంటున్నారు.