ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. ఏపీ హైకోర్టు తీర్పు | appsc group one mains cancil| high| court
posted on Mar 13, 2024 1:22PM
2018లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను రెండు సార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే.
తొలి సారి వచ్చిన ఫలితాలను వెలువరించకుండా రెండో సారి మళ్లీ మూల్యాకనం చేయించి తమకు కావలసిన వారిని ఎంపిక చేసి ఎపీపీఎస్సీ ఫలితాలను వెలువరించిందని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బుధవారం (మార్చి 13) తీర్పు వెలువరించింది.
గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను రెండు సార్లు మూల్యాకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.