Leading News Portal in Telugu

ఇక టీఎస్ కాదు టీజీయే! | telangana vehicle regestratin code tg| union| government| green


posted on Mar 13, 2024 11:04AM

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ లో ఇక నుంచి టీఎస్ కు బదులుగా టీజీ వాడుకలోకి రానుంది. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన  జరిగిన కేబినెట్ భేటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 

 ఈ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదానికి పంపింది. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ కాకుండా టీజీ అని ఉపయోగించేందుకు కేంద్రం సైతం ఆమెదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్ ను టీఎస్ నుంచి టీజీకి మార్చేందుకు మార్గం సుగమమైంది.

దీంతో ఇక నుంచి తెలంగాణలో రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ కోడ్ ఉంటుంది. అయితే ఈ మార్పు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే వర్తిస్తుంది. ఇప్పటికే టీఎస్ కోడ్ తో రిజిస్టర్ అయి ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లలో ఎటువంటి మార్పూ ఉండది. అవి అలాగే కొనసాగుతాయి. తెలంగాణ ఆవిర్బావం నుంచీ కూడా ఈ డిమాండ్ ఉంది. అయితే ఇప్పటికి కేంద్రం నుంచి అనుమతి లభించింది.