Leading News Portal in Telugu

ప్యాలెస్ పిచ్చోడి కథలు.. ధారావాహికం ..! | palace mad man stories| serial| fight| poor| rich| five| storied| hut| lifts


posted on Mar 13, 2024 9:34AM

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 52,263 చదరపు అడుగుల స్థలంలో మన పులివెందుల పేదోడి  ఐదు అంతస్థుల బుల్లి గుడిసె. 

 బుల్లి గుడిసె    బిల్డింగ్  ప్లాన్‌లో మూడు అంతస్తుల అండర్‌గ్రౌండ్ కార్ పార్కింగ్ అంతేనా అనేక ఎస్కలేటర్లు, లిఫ్టులు.   200 మంది “నిరుపేదలు కూర్చుని’’ చూసే  ఒక బుల్లి థియేటర్ .  మీ బిడ్డ  కూటికి గతిలేని నిరుపేదకు లైబ్రరీ, జిమ్ , స్క్వాష్, టెన్నిస్ , వాలీబాల్ కోర్ట్‌లు ఉన్నాయి. *పేదవాళ్ళు ఆడుకోకూడదా  అధ్యక్షా..?   

*మీ బిడ్డ గుడిసె నిర్మాణానికి  ఒక కాంట్రాక్టర్ రాజస్థాన్ నుండి 24 రైళ్ళలో పాలరాతి రాళ్ళు  తెప్పించాడు అధ్యక్షా ..!  

*మీ బిడ్డ గుడిసెలో 60 గదులు ఒక్కో బాత్రూం ఒక్కొక్కటి సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ పరిమాణంలో పాలరాయితో నిర్మించారు అధ్యక్ష..! 

*పేదవాడికి బాత్రూం ఉండకూడదా అధ్యక్షా ..!?

స్థానిక ప్రజలు “జగన్ ప్యాలెస్ “గా పిలుచుకుంటారు.  

అదే అధ్యక్షా మీ బిడ్డ *గుడిసె లోటస్ పాండ్ ప్యాలెస్.  ఆంధ్రులు పిచ్చోడి ప్యాలెస్ గా  పిలుస్తారు అధ్యక్షా!  

*మీ బిడ్డకు ఆఫీస్ కాంప్లెక్స్, 20 సర్వెంట్స్ క్వార్టర్స్ .  పెరట్లో రెండు అంతస్తుల అవుట్‌హౌస్‌తో పాటు 30 బెడ్‌రూమ్‌లు ఉంటాయి అధ్యక్షా 

మీ బిడ్డ ఈ నిరుపేద గుడిసె విలువ వెయ్యి కోట్ల పైమాటే అధ్యక్షా..!  

ప్యాలెస్ పిచ్చోడి మీ బిడ్డ బెంగళూరు గుడిసె కథ..! 

మీ బిడ్డ యలహంక కొంప కేవలం 23 ఎకరాల్లో నిర్మించారు అధ్యక్షా! మీరు విన్నది నిజమే అధ్యక్షా  మళ్లీ చెబుతున్న  మీ బిడ్డ 23 ఎకరాల్లో బుల్లి కొంప నిర్మించాడు అధ్యక్షా!   

ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఇల్లు కట్టు కోవడానికి మీ బిడ్డ ఒక సెంటు భూమి  పెతకం అమలులోకి తెచ్చాడు అధ్యక్షా!   మీ బిడ్డ మాత్రం 23 ఎకరాలు  అంటే రెండు వేల మూడు వందల సెంట్లలో ఒక కొంప .

అంటే ఒక మేజర్ పంచాయితి గ్రామం అంత స్థలంలో మీ బిడ్డ చిన్న గుడిసె అధ్యక్షా..! యలహంక ప్యాలెస్ లో  మూడు షిప్టుల్లో  125 మంది  పనివాళ్ళు పని చేస్తారు అధ్యక్షా! మీ బిడ్డకు  సొంత హెలీప్యాడ్  ప్యాలెస్ లోపల నిర్మించారు అధ్యక్షా! మీ బిడ్డ కోరుకుంటే  నిధులు, నిబంధనలు అడ్డురావు అధ్యక్షా!   బెంగుళూరులో  పేదవాళ్ల కోసం  మంత్రి మాల్ నిర్మించారు అధ్యక్షా!  మీ బిడ్డకు  నెలకు కోట్లలో  అద్దె వస్తుంది. అధ్యక్షా..!  

పులివెందుల ప్యాలెస్  వంద కుటుంబాలకు సరిపోయే చిన్న కొంప అధ్యక్ష .  కడప ప్యాలెస్  ప్రపంచంలో అత్తుత్తమ మెటీరియల్ తో  నిర్మించారు అధ్యక్షా!   ఇడుపులపాయల లో  మరొక ప్యాలెస్ అధ్యక్షా!  అంతేనా  చెనై లో  ఇంకొక ప్యాలెస్  అధ్యక్షా!   ఇక్కడితో  అవలేదు అధ్యక్షా  తాడేపల్లి  ప్యాలెస్ అధ్యక్షా మీ బిడ్డ నివసించే ప్యాలెస్ దారిలో రెండు వందల నిరుపేదల గుడిసెలు తొలగించి  రోడ్డు నిర్మించి  ఆ రోడ్డుకు  గేటు పెట్టి ప్రైవేట్ రోడ్ చేసాం అధ్యక్షా!   మీ బిడ్డ  వైజాగ్ వెళ్లినప్పుడు  ఎక్కడ వుండాలి అని ఆలోచించాను అధ్యక్షా! అదేదో  సినిమాలో అన్నట్టు  ఋషికొండ మీద కూర్చుంటే  విశాఖపట్నం  నా కాళ్ళ క్రింద వున్నట్టు అనిపిస్తుంది.  అందుకే టూరిజం కాటేజీలు  కూలగొట్టి  ప్రజల సొమ్ము  ఐదువందల కోట్ల  తో  చిన్న ప్యాలెస్ నిర్మించాం అధ్యక్షా! ప్రెస్టేజ్  ప్రకటన శ్రీమతి అడిగితే  ఎలా కాదనగలం.!  ఇంకా ఉంది అధ్యక్షా మీ బిడ్డ పేదవాడు అని  నిరూపించడానికి  కొన్ని ఉదాహారణలు  సాక్షీ పత్రిక, సాక్షీ టి.వి భారతి సిమెంట్ , సండూర్ పవర్ , కార్మెల్ ఏషియా తోసహా 31 షెల్ కంపెనీలతో 40 వేల కోట్లు అక్రమంగా  మీ బిడ్డ  కొల్లగొట్టారు అని CBI చెప్పింది అధ్యక్షా!  40 వేల కోట్లు  15 సంవత్సరాల క్రితం అధ్యక్షా!  ఇప్పుడు ఆ సంపద  ఎన్ని లక్షల కోట్లు  అయ్యిందో  మీ ఊహకే వదిలేస్తున్నా..!  ఇదంతా  గతం..! ఈ ఐదేళ్ళలో  లిక్కర్, మైనింగ్, ఇసుక, లెటరైట్, గనులు, కాంట్రాక్టులు, బలవంతపు వసూళ్ళు, సాక్షికి ప్రకటనల రూపంలో వేల కోట్ల  ప్రకటనలు, పెదవాళ్ల  ఇళ్ళకు  అత్యధిక ధరకు భారతి సిమెంట్ ఇలా చెప్పుకుంటూ  పోతే  తెల్లారుతుంది. ఇది అంతా కలిపితే  ఎంత  అంటే  మీ బిడ్డకు తెలియదు అధ్యక్షా! అంతా  ఇంట్లో వాళ్ళే  చూసుకుంటారు ! నేను నిమిత్తమాత్రుడిని  అందుకే  మీ బిడ్డ  పెదవాడికి  పెత్తందార్లతో  యుద్ధనికి సిద్దం అని ప్రకటించాను అధ్యక్షా..!