మూడో విడత రుణమాఫీకి సర్వం సిద్ధం.. మాట నిలుపుకున్న రేవంత్! | telangana cm full fil promise| farmer| loan| waive| three| phases| rs| two
posted on Aug 13, 2024 10:54AM
తెలంగాణ ప్రభుత్వం మూడో విడత రైతు రుణమాఫీకి సర్వం సిద్ధం చేసింది. పంద్రాగస్టు నాడు రెండు లక్షల రూపాయల వరకూ ఉన్న రైతుల రుణమాఫీని ఏకకాంలలో అమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ విమర్శలు, సవాళ్లకు దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారం పంద్రాగస్టులోగా రెండు లక్షల వరకూ రైతుల రుణాలను మాఫీ చేయడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగా ఇప్పటికే తొలి విడతలో లక్ష రూపాయలున, రెండో విడతలో లక్షన్నర రూపాయలు వరకూ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసిన రేవంత్ పంద్రాగస్టు నాడ రెండు లక్షల వరకూ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయడానికి రెడీ అయిపోయారు. పంద్రాగస్టు లోగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాననీ, హరీష్ రావు తన రాజీనామాను సిద్ధం చేసుకోవాలని రేవంత్ సవాల్ విసిరిన సంగతి విదితమే. అన్నట్లుగానే ఆయన పంద్రాగస్టు నాలు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుం టున్నారు. ఇలా ఉండగానే దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో అంటే 32.50 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించడం కోసం రూ. 31 వేల కోట్లు కేటాయించిన తొలి ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ రికార్డు సృష్టించింది.
తొలి విడతగా రూ. లక్ష లోపు రుణాలు ఉన్న 11 లక్షల 14 వేల 412 మంది రైతులకు రుణ విముక్తి కలిగించింది. రూ.6034.97 కోట్లు విడుదల చేసింది. రెండో విడతగా లక్ష నుంచి లక్షన్నర లోపు రుణాలు ఉన్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. ఇక మూడో విడతగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ రుణాలు ఉన్న రైతులకు పంద్రాగస్టు నాడు రుణవిముక్తులను చేయనుంది. ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లా వైరా మండలం నుంచి ప్రారంభించనున్నారు.
రెండు లక్షల వరకూ రైతు రుణాలను రేవంత్ సర్కార్ మాఫీ చేస్తాన్నన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసిన సవాల్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి.. అన్నట్లుగానే పంద్రాగస్టు నాటికి రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకూ రైతుల రుణాలను మాఫీ చేసి బంతిని హరీష్ కోర్టులో పడేశారు. ఇప్పుడు తన రాజీనామా సవాల్ హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.