posted on Aug 14, 2024 4:28PM
జగన్ అభిమాని సీమరాజా జగనన్నని ఎంతో అభిమానిస్తూనే పంచ్‌లు విసురుతూ వుంటారు. అయితే లేటెస్ట్.గా ఆయన జగన్ మీద చేసిన కామెంట్లు చాలా టూమచ్‌గా వున్నాయి. త్వరలో జగనన్న రాసలీలలు బయటపడబోతున్నాయంట. ఆ రాసలీలల వివరాలు చూసి రాష్ట్రం మొత్తం షాకైపోతుందంట. ఈమధ్య ఓ ఛానల్లో మాట్లాడుతూ సీమరాజా ఈ బాంబు పేల్చాడు. సీమారాజాకి జగన్న మీద అభిమానం వుంటే వుండొచ్చేమోగానీ, మరీ ఇంత అభిమానం ఏంటో అర్థం కాదు. జగనన్నేంటి.. రాసలీలలు చేసేదేంటి.. అవి బయటపడేదేంటి? ఛ.. ఛ.. నమ్మే విషయం కాదు.
కరెక్టే, వైసీపీ రాసలీలల పార్టీ అయిపోయింది… ఆ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. వైసీపీ నాయకులు రాసలీలల వ్యవహారాల్లో ఆరితేరిపోయారు. సెల్‌ఫోన్లో దర్శనం ఇచ్చిన గోరంట్ల మాధవ్ కావచ్చు… అంబటి రాంబాబు కావచ్చు.. అవంతి శ్రీనివాస్ కావచ్చు.. విజయసాయిరెడ్డి తాత కావచ్చు… ద్వారంపూడి – దళిత మహిళ వ్యవహారం కావచ్చు.. ఇంకా కొత్తగా బయటపడుతున్న సజ్జల బాపట్ల గెస్ట్ హౌస్ వ్యవహారం కావచ్చు… లేటెస్ట్.గా ట్రెండింగ్‌గా మారిన దువ్వాడ శ్రీనివాస్ – మాధురి రాసలీలల వ్యవహారం కావచ్చు… ఇలాంటివన్నీ వైసీపీని రాసలీలల పార్టీగా మార్చేశాయి. ఇంకా బయటపడని శృంగార పురుషులు వైసీపీలో చాలామంది వున్నారని వార్తలు వస్తున్నాయి. అంతే తప్ప, సాక్షాత్తూ జగన్ కూడా వాళ్ళలో ఒక మెంబర్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు సీమరాజా!
చూడు సీమరాజా… నువ్వెంతో అభిమానించే మీ జగనన్న మీదే ఇలాంటి బాంబులు విసరడం న్యాయమా చెప్పు? నువ్వు ఆధారాలు లేకుండా మాట్లాడవని తెలిసినప్పటికీ, ఎందుకో జగనన్నని ఆ యాంగిల్లో చూడలేకపోతున్నాం సీమరాజా. సర్లే, నీ దగ్గర ఏ ఆధారాలు వుండి అంత భారీ స్టేట్‌మెంట్ ఇచ్చావో ఏంటో. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత త్వరగా నీ దగ్గర వున్న ఆధారాలు బయటపెట్టు. కానీ, నువ్వు ఏ ఆధారం ప్రవేశపెట్టినా జగనన్నకి ఏమీ కాదనేది మా నమ్మకం. కడిగిన ముత్యం లాంటి జగనన్నని ఏ మకిలీ అంటదు!