posted on Aug 14, 2024 6:22PM
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక దక్షిణ మధ్య రైల్వేలో రైల్వే స్టేషన్ల దగ్గర టిక్కెట్ల కొనుగోలుకు క్యూఆర్ కోడ్ సదుపాయం వుండబోతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రయాణికుల చిల్లర కష్టాలు తీరనున్నాయి. ఈ సదుపాయం ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని కొన్ని ప్రధాన స్టేషన్లలో మాత్రమే అందుబాటులో వుంది. ఇప్పుడు అన్ని స్టేషన్లకూ దీనిని విస్తరించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇకపై అన్ని రైల్వేషన్లలో జనరల్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్లు చేయవచ్చు.