Leading News Portal in Telugu

ఆట మొదలైంది.. ‘ఆడుదాం ఆంధ్రా’పై విచారణ! | enquiry on adudam andhra| enquiry on roja


posted on Aug 15, 2024 8:50PM

అసలైన ఆట మొదలైంది. వైసీపీ రాక్షస పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన అవినీతి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కార్యక్రమం ద్వారా మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వున్న నేపథ్యంలో ప్రభుత్వం విచారణ జరపనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో రోజా అవినీతి మీద ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదేంటా అని ఎదురుచూస్తున్నారు. కానీ, దేనికైనా టైమ్ రావాలి.. ఇప్పుడు రోజా విషయంలో ఆట మొదలైంది.. ‘ఆడుదాం ఆంధ్రా’ మీద విచారణ కూడా మొదలైంది.