posted on Aug 16, 2024 4:09PM
జమ్ము కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. హర్యానా, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
జమ్ము కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలలో సెప్టెంబర్ 18న 24 స్థానాలకు, 25న 26 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అలాగే హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.