ఎట్ హోం లో జగన్ ఎక్కడా కనిపించలేదేం? | jagan absent to governers at hpme| programme| ignore| democrati| values| contitutional
posted on Aug 16, 2024 2:35PM
పంద్రాగస్టు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ గురువారం సాయంత్రం తన నివాసమైన రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, పద్మ పురస్కార గ్రహీతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం గైర్హాజరయ్యారు.
ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు. అయినా జగన్ హాజరు కాకపోవడానికి కారణాలేమిటన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ గైర్హాజరుకు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. గవర్నర్ ఆహ్వానాన్ని మన్నించకుండా డుమ్మా కొట్టడానికి కారణం ఈ ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల హాజరు కావడమేనని అంటున్నారు. వీరిరువురినీ ఫేస్ చేసే ధైర్యం లేకే జగన్ ఎట్ హోం కార్యక్రమానికి ముఖం చాటేశారన్నది పరిశీలకుల విశ్లేషణ్. గవర్నర్ ఇచ్చిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సిఎస్ నీరబ్ కుమార్, డిజిపి ద్వారకా తిరుమల రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే విధంగా రాష్టర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
అహ్లాదపూర్వక వాతావరణం జరిగిన ఈ విందుకు హాజరైన వారంతా ఎలాంటి అరమరికలూ లేకుండా పరస్పరం పలకరించుకొని మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్ద వైఎస్ షర్మిలని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమం సుమారు గంటసేపు సాగింది. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ విందుకు కనీసం ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ కూడా లేని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. కానీ ఆమె సోదరుడు, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు మాత్రం గైర్హాజరయ్యారు. ఈ విందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిందో, వైసీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఇచ్చిందో కాదు. ఏటా పంద్రాగస్టు నాడు సాయంత్రం గవర్నర్ ఇచ్చే విందు. పార్టీలూ, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ హాజరవ్వడం విధాయకం.
అయితే అటువంటి సంప్రదాయలు, ఆనవాయితీలను పట్టించుకోకుండా జగన్ గైర్హాజర్ కావడం ద్వారా తనను తాను తగ్గించుకున్నారు. తనను తాను అగౌరవ పరుచుకున్నారు. జగన్ తీరు చూస్తుంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి తెలంగాణ గవర్నర్ తో సరిపడటం లేదంటూ కేసీఆర్ కూడా ఎట్ హోంను బహిష్కరించేవారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలని గౌరవించకపోవడంలో జగన్, కేసీఆర్ లు దొందూదొందేనని పరిశీలకులు అంటున్నారు. తమ తీరుద్వారా అదే నిజమని వీరిరువురూ పదే పదే రుజువు చేస్తున్నారు.