posted on Aug 18, 2024 2:34PM
ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వాసుదేవరెడ్డి ప్రస్తుతం సీఐడీ అదుపులో వున్నారు. జగన్ రాక్షస పాలనలో భారీ స్థాయిలో జరిగిన మద్యం కుంభకోణంలో వాసుదేవ రెడ్డి కీలక పాత్ర నిర్వహించారు. ప్రస్తుతం ఒక అజ్ఞాత ప్రాంతంలో వాసుదేవ రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జే’ బ్రాండ్ మద్యం ప్రవాహానికి ముఖ్య కారకుడు వాసుదేవరెడ్డి. ఈ స్కామ్‌లో వాసుదేవరెడ్డి మీద భారీ స్థాయిలో అభియోగాలు వచ్చాయి. జగన్ అధికారంలోకి రాగానే డిప్యూటేషన్‌పై వాసుదేవ రెడ్డిని రప్పించిన జగన్ ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ ఎండీ బాధ్యతలు తద్వారా మద్యం సేల్స్ బాధ్యతలు అప్పగించారు. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై వాసుదేవ రెడ్డిదే అజమాయిషీ. జే బ్రాండ్లు తీసుకురావటంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. వైసీపీ దోపిడీకి కర్త, కర్మ, క్రియ వాసుదేవరెడ్డి. కేసులు వెంటాడడంతో 2 నెలలకుపైగా వాసుదేవరెడ్డి పరారీలో వున్నారు. కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. వాసుదేవరెడ్డి ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించిన సీఐడీ పోలీసులకు అనేక కీలక ఆధారాలు దొరికాయి.