Leading News Portal in Telugu

హైదరాబాద్ లో కుంభవృష్ఠి | heavy rain in hyderabad| traffic| jam| warer| logged| power


posted on Aug 20, 2024 7:08AM

భాగ్యనగరాన్ని జడివాన ముంచెత్తింది. మంగళవారం (ఆగస్టు 20) తెల్లవారు జామునుంచీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. హైదరాబాద్ లో సోమవారం (ఆగస్టు 19) మధ్యాహ్నం నుంచీ వర్షం కురుస్తూనే ఉంది.

ఉదయం అంతా ఎండ ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలలో గంటల తరబడి భారీ వర్షం కురిసింది.   హైదరాబాద్ తో పాటు కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలలో కూడా భారీ వర్షం కారణంగా జనం నానా ఇబ్బందులూ పడ్డారు.  

సోమవారం (ఆగస్లు 19)సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, సనత్ నగర్, ఎల్ బీ  నగర్, నాగోల్, చైతన్యపురి, కొత్తపేట్‌, ముషీరాబాద్, చిక్కడపల్లి , రాంనగర్, అశోక్ నగర్ పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా  ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.