Leading News Portal in Telugu

వేణుస్వామి దంపతులపై ఫిర్యాదు | Journalist Murthy who filed a police complaint against the Venuswamy couple


posted on Aug 20, 2024 3:25PM

తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగ వేణుస్వామి దంపతులు వీడియో రిలీజ్ చేశాడని ఆరోపిస్తూ జర్నలిస్ట్ మూర్తి మంగళవారం జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తోంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ.. టీవీ 5 డిబేట్‌లతో స్వామి వారి యవ్వారాలన్నింటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి రూ.5 కోట్లు డిమాంట్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణు స్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు వేణుస్వామి.

వేణుస్వామి దంపతుల వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు నిమిషం 50 సెకన్ల నిడివి గ‌ల ఈ వీడియోలో వేణుస్వామి దంపతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 2017లో మహాటీవీలో ఉన్న నాటి నుంచి మూర్తి తనను టార్గెట్ చేశారని చెప్పారు వేణుస్వామి. అతను అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో గత 8 నెలలుగా మూర్తి టీమ్‌ తనపై దాడులు చేస్తోందన్నారు. డబ్బులు ఇచ్చి మరీ మూర్తి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. దీంతో మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలన్న స్థితికి చేరుకున్నట్లు చెప్పారు. మానసిక క్షోభతో గడిచిన 8 నెలల్లో 15 కేజీల బరువు తగ్గినట్లు చెప్పారు. ఈ ఇష్యూకు సంబంధించి ఓ ఆడియోను కూడా వేణుస్వామి దంపతులు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.