Leading News Portal in Telugu

పంజాగుట్టలో పిడుగు పడి రెయిలింగ్ గోడ ధ్వంసం | Thunderstorm


posted on Aug 20, 2024 5:00PM

సోమవారం మధ్యా హ్నం కురిసిన భారీ వర్షంతో గ్రేటర్‌ హైదరాబాద్ ప్రజలు రోడ్లపైనే నరకం చవిచూశారు. ఏకధాటిగా గంటన్నరకు పైగానే వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో రెండు గంటల పాటు నాన్ స్టాప్ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు వర్షపునీటితో మునకేసి చెరువులను తలపించాయి. ఇక పంజాగుట్టలోని సుఖ్ నివాస్ అపార్టు మెంట్ వద్ద పిడుగు పడింది. అపార్ట్ మెంట్ రెయిలింగ్ గోడ ధ్వంసం అయ్యింది ఘటనలో కారు ధ్వంసం అయ్యింది. పంజాగుట్టలో పడిన పిడుగు వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు భయాందోళన చెందారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.